Skip to content

Koneru Charitable Trust

  • About Trust
  • Land Donors
  • Founder Trustees
  • Trust Building
  • Executive Committee
  • Trust Activities
  • Toggle search form

Trust Building

1998లో కాకతాళీయంగా జరిగిన సమావేశంలో కోనేరు వంశస్థుల పురోభవృద్ధికి జరిపిన సమాలోచనలనుుంచి ఆవిర్భవించిన కోనేరు చారిటబుల్ ట్రస్టు 1999లో రిజిస్టరయి, 2000, 2002 సం॥లలో కోనేరు లక్ష్మయ్య ఇంజనీరిింగ్ కాలేజీలో బృహత్తర సమావేశాలు నిర్వహించి, 2004లో గోసాలవాసి నాగేశ్వరరావు, విజయకుమారి దంపతులు దానం చేసిన 29 సెంట్ల స్థలముతో పరిపుష్టిని సంతరించుకుంది.

కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయ ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ వెెంటనే ఒక గది నిర్మాణానికి అవసరమైన లక్ష రూపాయల సామాగ్రిని పంపించారు. ప్రముఖ ఎన్టీపిసి కాంట్రాక్టర్ కోనేరు వీరభద్రరావు లక్ష రూపాయలు ఇచ్చారు. మదుసూధనరావు, వారి సోదరులు కలిసి ఒక గదికి, వారి ప్రోద్భలంతో బెెంగుళూరు వాసులు, పారిశ్రామిక వేత్త కోనేరు శివరావు రెెండు గదులకు, గోసాలవాసి సత్యమోహనరావు, గోసాలవారి అల్లుడు కోనేరు పూర్ణచంద్రరావు కోటేశ్వరరావు తమ్ముడు డా॥ రాఘవేేంద్రరావు, గోసాలలో బాల్యాన్ని గడిపిన డా॥ సుంకర వెెంకట బసవరావు, కోనేరు రామమోహనరావు తనయుడు బాల వెెంకట విజయకుమార్ (విజెఏ), ఫిజిక్సు లెక్చరరుగా ఎంసెట్ కోచింగ్ ఇచ్చి తర్వాత యూఎస్ఏలో వ్యాపారము చేసి వచ్చిన వెెంకట సత్యహనుమాన్ ప్రసాద్ తలా ఒక లక్షరూపాయలు ఇవ్వటము జరిగిింది. 2005వ సంవత్సరము నా టికి పదకొొండు గదుల నిర్మాణము జరిగి అన్ని ఆధునిక సౌకర్యములతో వృద్ధాశ్రమం ప్రారంభమైైంది. కాలక్రమేణ, గ్రౌండ్ ఫ్లోరులో మరో మూడు గ దులు, మొదటి అంతస్థులో 13 గదుల నిర్మాణము జరిగినది. ప్రతి గదిలో ఇద్దరు ఉండే విధముగా వసతి కల్పించబడినది. తర్వాత పది సంవత్సరాలల, దాతల సహకారంతో, తండ్రీతనయులు మదుసూధనరావు, శ్రీధర్ అవిరళకృషితో రమారమి 10,000 చ।।అ॥లలో 28 గదులు కట్టబడినవి.

Koneru Charitable Trust Building

“టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్” అధ్యక్షులు కోనేరు నరేేంద్ర బాబు ప్రోద్భలంతో న్యూఢిల్లీ వాసులు కోనేరు ఆషా, పోలవరపు రత్నచరణ్బాబు దంపతులు రెెండు గదులకు, అమెరికాలో స్థిరపడిన కోనేరు హస్సన్రావు, ఝాన్సీలక్ష్మీ దంప తులు నాలుగు గ దులకు ఎనికేపాడు నుుండి కోనేరు వెెంకటనారాయణ, శివరామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేేంద్రప్రసాద్, నాగార్జున విశ్వవిద్యాలయ “లింగిస్టిక్స్ ” ప్రొఫెసర్ తమ్మారెడ్డి నిర్మల, పెనమలూరు వాస్తవ్యులు, రియల్ ఎస్టేటు రంగంలో ప్రముఖులు ముసునూరు బాలమన్మథరావు మరియు గోసాల, వణుకూరు వాసులనేకులందించిన సహాయ సహకారములతో ఈ నిర్మాణము జరిగినది. భవన నిర్మాణానికి కోనేరు మదుసూధనరావు, తర్వాత వారి కుమారుడు పూర్వ విజయవాడ మేయరు శ్రీధర్ అవిరళకృషి, నిరంతర పర్యవేక్షణ మరుపురానిది. కోశాధికారులుగా చేసిన నా గేశ్వరరావు, రవీంద్ర కుమారుల కృషి, ఆంజనేయులు, శ్రీధర్ సెక్రటరీలుగా చేసిన అభివృద్ధి సదా చిరస్మరణీయం.

గత 9 సం॥లలో, రెెండవ అంతస్థు అన్ని హంగులతో ఏర్పరచి, సోలార్ విద్యుత్తు అమర్చి, ప్రహరీగోడను పటిష్టపరచి, డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మాణము చేసి, హోములో వసతులు మెరుగు పరచిన కోశాధికారి కోటేశ్వర రావు, అధ్యక్షులు డా॥ రాఘవేేంద్రరావు, కార్యదర్శి భీమేశ్వరరావు, ట్రస్టీ నా గేశ్వరరావులు అభినందనీయులు. 2015-16లలో రెెండవ అంతస్థులో సమావేశపు హాలు, డై నిింగ్ హాలు నిర్మించటమైనది. ఇంకా ఫ్లోరిింగ్, ఎలక్ట్రిక్ వైరిింగ్, శానిటేషన్ , కార్పెంటింగ్, పెయింటింగ్ పనులు దాతల సహకారముతో జరపవలసియున్నది.

Copyright © 2026 Koneru Charitable Trust.

Powered by PressBook Green WordPress theme