ట్రస్టు ఆవిర్భావం
తొమ్మిది మంది వ్యవస్థాపక ట్రస్టీలతో 1999వ సంవత్సరంములో 34/బి.కె-4/99 నెెంబరుతో కోనేరు చారిటబుల్ ట్రస్టును రిజిస్టర్ చేయటమైనది. సత్సంకల్పంతో తొమ్మిది మంది పెద్దలు 1999లో స్థాపించిన కోనేరు చారిటబుల్ ట్రస్టు వదాన్యుల సహకారం, ప్రోత్సాహం, ప్రోద్భలంతో గోసాల గ్రామంలో వృద్థాశ్రమ నిర్వహణ, ప్రతిభావంతులైన విద్యార్థులకు పారితోషికాల వితరణ, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయటం, సేవారంగ ప్రముఖులను సత్కరించటం వంటి కార్యాక్రమాలను నిర్వహిస్తున్నాము.
కోనేరు చారిటబుల్ ట్రస్టు ప్రారంభించడానికి ప్రేరణ 1999వ సంవత్సరంలో భారత క్రీడా రంగంలో అపూర్వ సంచలనాన్ని సృష్ఠించిన పన్నెండు సంవత్సరాల కోనేరు ఆడపడుచు, చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి, ఆసియా ఖండంలో “ఇంటర్నేషనల్ యంగెస్ట్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్” అవార్డు వచ్చినప్పుడు, మన ఆడపడుచుని సత్కరిద్దామని పేపరులో ఇచ్చిన ప్రకటనతో ఈ సంస్థ ఆవిర్భావము జరిగినది.
ట్రస్టు ముఖ్య ఉద్దేశములు
వృద్ధాశ్రమములు నిర్మించి నిర్వహించుట, ప్రతిభావంతులైన పేద విద్యార్థుల పై చదువులకు ఉపకార వేతనములు అందజేయుట, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సన్మానించుట.
సభ్యత్వం
కోనేరు వంశీయులకు ట్రస్టులో మూడు రకముల సభ్యత్వములు గలవు.
- మొదటిది శాశ్వత సభ్యతం పదివేల రూపాయలు వంశపారంపర్యంగా “లా ఆఫ్ ప్రిమోజెనిచర్” ననుసరిించి పెద్ద కొడుకునకు సంక్రమిస్తుంది.
- రెెండవది ఐదువేల రూపాయలు. ఇది రెెండు త రాలకు వర్తిస్తుంది.
- మూడవది రెెండు వేల ఐదువందల రూపాయలు. ఇది కోనేరు ఆడపడుచులకు / జీవితకాల సభ్యత్వానికి వర్తిస్తుంది .
వ్యవస్థాపక ట్రస్టీలు
పది సంవత్సరాలు గుణదల గ్రామ సర్పంచిగా పనిచేసిన అభ్యుదయవాది, కార్యదక్షుడు, వితరణశీలి కోనేరు నా రాయణరావు; “లైక్ బిగెట్స్ లైక్” కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయ ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ, ఆ రోజులలో విజయవాడ పాఠశాల విద్యకు పర్యాయపదంగా వాణీనికేతన్ విద్యా సంస్థలు నెలకొల్పిన అధినేత కోనేరు రామచంద్రరావు; ఆంధ్రలయోలా కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్గా చేసిన కోనేరు సుబ్బయ్య (వీరి సతీమణి డా॥ ఆదిలక్ష్మి, వారి కుటుంబం యావత్తు వైద్యరంగంలో సుప్రసిద్ధులు); కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ప్రస్తుత ఆర్టిఎ భవన సముదాయ నిర్మాత మదుసూధనరావు, ఎనికేపాడు శ్రీ లక్ష్మి డాల్ మిల్, వెంకటేశ్వర గోడౌన్ అధిపతి కోనేరు భాస్కరరావు; ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు రామలింగేశ్వరరావు; షేర్ బ్రోకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేరు వాసుదేవరావు; వాసవీకాలనీ వాస్తవ్యులు, వ్యాపారవేత్త, తెలుగు దేశం నాయకులు, కోనేరు బసవేశ్వరరావు కలిసి ఈ తొమ్మిదిమంది (నవరత్నాలు) వ్యవస్థాపక ట్రస్టీలుగా ఏర్పడి ట్రస్టును రిజిస్టర్ చేయటమైనది. ఈ ట్రస్టును స్థాపించుటకు నారాయణరావు పట్టుదల, బసవేస్వరరావు ప్రణాళికా చతురత, రామలింగేశ్వరరావు కృషి, ప్రాథమిక సమావేశములు జరుపుటకు తన సంస్థల భవనముల నిచ్చిన రామచంద్రరావు తోడ్పాటు మరువలేనిది. ట్రస్టుకు సభ్యులను చేర్ఫించుటలో మదుసూధనరావు, విశ్రరాంత రైల్వే అధికారి, గొడవర్రు వాస్తవ్యులు కోనేరు ఆంజనేయులు కృషి చిరస్మరణీయం.
స్థల దాతలు
గోసాల వాస్త్యవ్యలు కోనేరు నాగేశ్వరరావు విజయకుమారి దంపతులకు ఇద్దరు సంతానము – రమేష్, మోహన్. విధి వైపరీత్యమున 1990లో ఆరునెలల వ్యవధిలో ఆ పిల్లలు ఇద్దరు దివంగతులయ్యారు. వారి 29 సెంట్ల నివాసస్థలాన్ని కోనేరు ఛారిటబుల్ ట్రస్టుకు 2004వ సంవత్సరంలో వారి పిల్లల స్మృత్యర్థం దానం చేశారు. గ్రామానికి దగ్గరగా ఉన్న ఈ స్థలాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయులు పర్వతనేని రాజారావు రూ.50,000/- వృద్ధాశ్రమ నిర్మాణానికి విరాళము ప్రకటిించి అందరినీ ఉత్తేజ పరిచారు.
29 సెంట్ల స్థలము ఇవ్వటమే కాకుుండా, భవన నిర్మాణంలోనూ, వృద్ధాశ్రమ దైనందిన నిర్వహణలోను పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్న నాగేశ్వరరావు, విజయకుమారి దంప తుల సేవలు వెలకట్టలేనివి.
భవన నిర్మాణం
1998లో కాకతాళీయంగా జరిగిన సమావేశంలో కోనేరు వంశస్థుల పురోభవృద్ధికి జరిపిన సమాలోచనలనుుంచి ఆవిర్భవించిన కోనేరు చారిటబుల్ ట్రస్టు 1999లో రిజిస్టరయి, 2000, 2002 సం॥లలో కోనేరు లక్ష్మయ్య ఇంజనీరిింగ్ కాలేజీలో బృహత్తర సమావేశాలు నిర్వహించి, 2004లో గోసాలవాసి నాగేశ్వరరావు, విజయకుమారి దంపతులు దానం చేసిన 29 సెంట్ల స్థలముతో పరిపుష్టిని సంతరించుకుంది.
కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయ ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ వెెంటనే ఒక గది నిర్మాణానికి అవసరమైన లక్ష రూపాయల సామాగ్రిని పంపించారు. ప్రముఖ ఎన్టీపిసి కాంట్రాక్టర్ కోనేరు వీరభద్రరావు లక్ష రూపాయలు ఇచ్చారు. మదుసూధనరావు, వారి సోదరులు కలిసి ఒక గదికి, వారి ప్రోద్భలంతో బెెంగుళూరు వాసులు, పారిశ్రామిక వేత్త కోనేరు శివరావు రెెండు గదులకు, గోసాలవాసి సత్యమోహనరావు, గోసాలవారి అల్లుడు కోనేరు పూర్ణచంద్రరావు కోటేశ్వరరావు తమ్ముడు డా॥ రాఘవేేంద్రరావు, గోసాలలో బాల్యాన్ని గడిపిన డా॥ సుంకర వెెంకట బసవరావు, కోనేరు రామమోహనరావు తనయుడు బాల వెెంకట విజయకుమార్ (విజెఏ), ఫిజిక్సు లెక్చరరుగా ఎంసెట్ కోచింగ్ ఇచ్చి తర్వాత యూఎస్ఏలో వ్యాపారము చేసి వచ్చిన వెెంకట సత్యహనుమాన్ ప్రసాద్ తలా ఒక లక్షరూపాయలు ఇవ్వటము జరిగిింది. 2005వ సంవత్సరము నా టికి పదకొొండు గదుల నిర్మాణము జరిగి అన్ని ఆధునిక సౌకర్యములతో వృద్ధాశ్రమం ప్రారంభమైైంది. కాలక్రమేణ, గ్రౌండ్ ఫ్లోరులో మరో మూడు గ దులు, మొదటి అంతస్థులో 13 గదుల నిర్మాణము జరిగినది. ప్రతి గదిలో ఇద్దరు ఉండే విధముగా వసతి కల్పించబడినది. తర్వాత పది సంవత్సరాలల, దాతల సహకారంతో, తండ్రీతనయులు మదుసూధనరావు, శ్రీధర్ అవిరళకృషితో రమారమి 10,000 చ।।అ॥లలో 28 గదులు కట్టబడినవి.
గత 9 సం॥లలో, రెెండవ అంతస్థు అన్ని హంగులతో ఏర్పరచి, సోలార్ విద్యుత్తు అమర్చి, ప్రహరీగోడను పటిష్టపరచి, డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మాణము చేసి, హోములో వసతులు మెరుగు పరచిన కోశాధికారి కోటేశ్వర రావు, అధ్యక్షులు డా॥ రాఘవేేంద్రరావు, కార్యదర్శి భీమేశ్వరరావు, ట్రస్టీ నా గేశ్వరరావులు అభినందనీయులు.
వాసుదేవరావు గారి ప్రోత్సాహముతో నెలకొల్పిన అన్నదాన పథకము, చలమయ్యగారు ప్రారంభించిన ప్రతిభా పురస్కార నిధి మన ట్రస్టు ఆర్థిక ప రిస్థితిని మెరుగు పరిచాయనటంలో సందేహం లేదు.